ప్రొద్దుటూరులో జనసేనకు 10 పంచాయతీలు.?

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ 
10 పంచాయతీల్లో పోటీ చేస్తున్నట్లు ఆపార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త మాదాసు మురళీ తెలిపారు.  ప్రొద్దుటూరు మండలంలోని చౌటపల్లె, దొరసానిపల్లె, గోపవరం, కొత్తపల్లె, పెద్ద శెట్టిపల్లె, సోములవారిపల్లె, తాళ్ళమాపురం పంచాయితీల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.  రాజుపాలెం మండలంలో
కొర్రపాడు, రాజుపాలెం, టంగుటూరు పంచాయతీల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు.  ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి తమకు జాబితా పంపారన్నారు.  పోటీ చేయాలనే పార్టీకి చెందిన ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
*ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చైర్మన్, 52 వార్డులకు గాను..  13 వార్డుల్లో పోటీకి జనసేన స్థానిక నేతలు అధిష్టానానికి లిస్ట్ పంపారు.  ఒక్క స్థానం కూడా కూటమి జనసేనకు కేటాయించలేదు.  దాంతో మున్సిపాలిటీలో జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
*ప్రొద్దుటూరు మండలం తాళ్ళమాపురం MPTC స్థానంలో జనసేన అభ్యర్థి మౌనికపై టిడిపి మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థి సుబ్బమ్మ విజయం సాధించారు. 
*ఈ పరిస్థితుల్లో పంచాయితీ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.