ప్రొద్దుటూరులో బంగారెడ్డి Vs కమిషనర్.. సెటైర్లు.!

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు.  ఈనెల 5న సోమవారం ప్రొద్దుటూరుకు సీఎం చంద్రబాబు వస్తున్నారు.  డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా హాజరవుతున్నారు.  ఈ సందర్భంగా 40 వేలు టార్గెట్ పెట్టుకొని మహిళలు తరలిరావాలని నిన్న కమిషనర్ పిలుపునిచ్చారు.  దీనిపై నేడు వైసీపీ నేత బంగారెడ్డి స్పందిస్తూ.. డబ్బులిచ్చి సీఎం సభకు జనాలను తరలిస్తున్నారా అని ప్రశ్నించారు.  ప్రొద్దుటూరు మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడ్డం తగదని కమీషనర్ ఖండించారు.  వీరి మద్య జరిగిన సంభాషణ సోషియల్ మీడియాలో వైరల్ అయ్యింది.  వైసీపీ, టిడిపి నేతలు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు.