PDTR: స్మార్ట్ కిచెన్లో గుడ్లు మాత్రమే మాయమయ్యాయా.?

ప్రొద్దుటూరు స్మార్ట్ కిచెన్లో విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన 16,800 గుడ్లు మాయమయ్యాయి.  దీనిపై ప్రొద్దుటూరు ఎంఈఓ శోభ స్మార్ట్ కిచెన్ మేనేజర్(CRP)కు షోకాజ్ నోటీసు ఇచ్చారు.  స్మార్ట్ కిచెన్ మేనేజర్, నిర్వాహకులు, సప్లయర్ ఒక్కటై గత నెలలో సుమారు 25 వేల గుడ్లను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.  ఇక్కడి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి బియ్యం, కంది పప్పు, వంట నూనె, ఇతర సరుకులను బయటికి తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  కడప జిల్లా కలెక్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మోడల్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను జిల్లాలో తీసుకువచ్చారు.  ఇక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ పరిస్థితుల్లో కేవలం గత నెలలో మాత్రమే ఒక్క ప్రొద్దుటూరు స్మార్ట్ కిచెన్లోనే అధికారికంగా 16,800 గుడ్లు లెక్కల్లో తేడా వచ్చాయి.  జిల్లాలోని ఇతర స్మార్ట్ కిచెన్లలో పరిస్థితి ఎలా ఉందోనని విద్యార్థుల పేరెంట్స్, ప్రజలు అనుమానిస్తున్నారు.  దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!