సీఎం పర్యటన విజయవంతం చేయాలి:MLA వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు: ఈనెల 5న సీఎం చంద్రబాబు ప్రొద్దుటూరు పర్యటనకు వస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆయన కూటమి నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మొట్ట మొదటిసారిగా ప్రొద్దుటూరు పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. వారికి భారీ జన సమీకరణతో స్వాగతం పలికి, పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.