ప్రొద్దుటూరు ప్రభుత్వ బాలుర పాఠశాలలో HM పోస్ట్.. రాజకీయం.!
ప్రొద్దుటూరు ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 345 విద్యార్థులు, 15 మంది ఉపాద్యాయులు ఉన్నారు. అడ్మిషన్స్ బాగా ఉన్నాయి. ఇటువంటి పాఠశాలలో టీచర్లు 2 వర్గాలుగా మారి, రాజకీయాలు నడుపుతున్నారు. FAC HM పోస్ట్ కోసం పైరవీలు, పిర్యాదులు చేస్తున్నారు. ఈ పోస్ట్ కోసం ఇక్కడి ఇంకో వర్గం కన్నేసింది. పై అధికారులకు కంప్లైంట్ పెట్టారు. వీటిపై ఇటీవల MEO, డిప్యూటీ DEO పాఠశాలకు వచ్చి విచారించారు. రిపోర్ట్ పంపారు. ఈ పరిస్థితుల్లో ఇంచార్జి HMగా అమర్నాథ్ రెడ్డినే కొనసాగించాలని పేరెంట్స్ కమిటీ ఉన్నతాధికారులకు లెటర్స్ పెట్టారు. స్థానిక MLA వరదరాజుల రెడ్డి కూడా గురువారం RJD, DEOకు ఫోన్ చేసి, అమర్నాథ్ రెడ్డినే కొనసాగించాలని ఆదేశించారు. దీంతో HM పోస్ట్ పై రాజకీయం నడుస్తోంది.
కాగా..ఇక్కడి రెగ్యులర్ HM శివప్రసాద్ రాజును తొండూరు MEOగా డిప్యూటేషన్ పంపారు. సీనియర్ టీచర్ అమర్నాథ్ రెడ్డిని ఇంచార్జి FAC HMగా నియమించారు.