గుడ్లు మాయం.. DEO శంషుద్దీన్ విచారణ.!
ప్రొద్దుటూరు స్మార్ట్ కిచెన్లో విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన కోడి గుడ్లు మాయమయ్యాయి. దీనిపై DEO శంషుద్దీన్ బుధవారం ప్రొద్దుటూరుకు వచ్చారు. విచారణ చేపట్టారు. స్మార్ట్ కిచెన్ తనిఖీ చేశారు. రికార్డులు, సరుకులు పరిశీలించారు. కోడి గుడ్లు మాయంపై అధికారులను, సిబ్బందిని విచారించారు. భవిష్యత్లో ఇటువంటివి పునరావృత్తం కాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. CC కెమెరాలు పుటేజీ జాగ్రత్త పరచాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. DEO వెంట స్థానిక MEO, CRPలు ఉన్నారు.