ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ అవినీతిపై CMకు పిర్యాదు: టిడిపి నేత ఉక్కు ప్రవీణ్

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ అవినీతి, అక్రమాలపై CM, డిప్యూటీ CMకు పిర్యాదు చేస్తామని, ఆధారాలతో కోర్టులో కేసు వేస్తామని ప్రొద్దుటూరు TDP నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్లను కమీషనర్ ఇంటికి పిలిపించుకొని రూ.10 లక్షలు డిమాండ్ చేశాడన్నారు. కొత్తపల్లె పంచాయితీలో ఎగ్జిబిషన్ ఏర్పాటుపై కమిషనర్ కంప్లైంట్ పెట్టీ ఆపించాడన్నారు. మున్సిపల్ ఎగ్జిబిషన్లో కమిషనర్ వాటా ఎంతని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డిని కూడా గుర్తుపట్టలేని మానసిక స్థితిలో కమిషనర్ ఉన్నాడన్నారు. ప్లాస్టిక్ నిషేధం పేరుతో డ్రామా సాగించాడని విమర్శించారు. కమిషనర్ అవినీతిపై ఆధారాలు ఉన్నాయన్నారు. పూర్తి అమౌంట్ కట్టించుకోకుండా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తే పగలు కమిషనర్ ఆపీస్ వద్ద, సాయంత్రం ఎగ్జిబిషన్ వద్ద ధర్నా చేస్తానని హెచ్చరించారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.