కడప జిల్లాలో CM చంద్రబాబు పర్యటన ఇలా.!

కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఇలా.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 5న కడప జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జల్ జీవన్ మిషన్ పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు, బొల్లవరం బైపాస్ సమీపంలోని తిమ్మయ్య ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సీఎం కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్
తేదీ: 05 అక్టోబర్ 2026
సమయం పర్యటన వివరాలు
ఉ. 9:40 గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
ఉ. 11:00 కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం మోడమిడిపల్లె గ్రామంలోని అమృత్ నగర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
11:00 – 11:10 ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరుల స్వాగత కార్యక్రమం.
ఉ. 11:10 అమృత్ నగర్ హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో కొత్తపల్లి గ్రామంలోని పైలాన్ ఆవిష్కరణ ప్రాంగణానికి బయలుదేరుతారు.
ఉ. 11:15 కొత్తపల్లి గ్రామంలోని జల్ జీవన్ మిషన్ పైలాన్ ఆవిష్కరణ ప్రాంగణానికి చేరుకుంటారు.
11:15 – 11:20 జల్ జీవన్ మిషన్ పైలాన్ ఆవిష్కరణ.
ఉ. 11:20 పైలాన్ ప్రాంగణం నుంచి రోడ్డు మార్గంలో బొల్లవరం బైపాస్ సమీపంలోని తిమ్మయ్య ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బయలుదేరుతారు.
ఉ. 11:25 బొల్లవరం బైపాస్ సమీపంలోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు.
11:25 – మ. 1:35 బహిరంగ సభలో పాల్గొనడం, జల్ జీవన్ మిషన్‌కు సంబంధించిన 13 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.
మ. 1:35 బహిరంగ సభ ప్రాంగణం నుంచి రోడ్డు మార్గంలో అమృత్ నగర్ హెలిప్యాడ్‌కు బయలుదేరుతారు.
మ. 1:45 అమృత్ నగర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
మ. 1:50 హెలికాప్టర్‌లో ఉండవల్లి నివాసానికి బయలుదేరుతారు.
మ. 3:10 గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని నివాసానికి చేరుకుంటారు.
ప్రొద్దుటూరులో సీఎం పర్యటన
పైలాన్ ఆవిష్కరణ.. భారీ బహిరంగ సభ

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రొద్దుటూరు ప్రాంతంలో ఏర్పాట్లు కొనసాగనున్నాయి. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, బహిరంగ సభపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.


ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!