ప్రొద్దుటూరు: CMతో జలజీవన్ ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవం.!
ప్రొద్దుటూరుకు జలజీవన్ మిషన్ ప్రాజెక్టు కింద రూ.18.34 కోట్లు వచ్చాయి. ఈనెల 5న CM చంద్రబాబు జలజీవన్ మిషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. జలజీవన్ మిషన్ ప్రాజెక్టు కింద ప్రొద్దుటూరు మండలంలోని రామేశ్వరంకు రూ.7.75కోట్లు, ఎర్రగుంటపల్లెకు రూ.0.51 కోట్లు, శెట్టిపల్లెకు రూ.0.81కోట్లు, తాళ్లమాపురంకు రూ.1.46కోట్లు, దొరసానిపల్లెకు రూ.9.56కోట్లు, కల్లూరుకు రూ.1.75కోట్లు, కామనూరుకు రూ.1.28కోట్లు, నంగునూరుపల్లెకు రూ.2.34కోట్లు, కొత్తపల్లెకు రూ.2.08 కోట్లు వచ్చాయి.