కడప జిల్లాలో పవన్ పర్యటన ఇలా.!
డిప్యూటీ సీఎం పవన్ పర్యటన వివరాలు ఇలా.!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రేపు (అక్టోబర్ 5) కడప జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు. ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పైలాన్ ఆవిష్కరణతో పాటు బొల్లవరం బైపాస్ సమీపంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్
| సమయం | కార్యక్రమం / వివరాలు |
|---|---|
| ఉ. 8:45 | మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరడం. |
| ఉ. 9:25 | గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడం. |
| ఉ. 9:30 | ప్రత్యేక విమానంలో కడపకు ప్రయాణం. |
| ఉ. 10:30 | కడప విమానాశ్రయానికి చేరుకోవడం. |
| ఉ. 10:35 | హెలికాప్టర్లో ప్రొద్దుటూరు మండలం అమృత్ నగర్, మోడమిడిపల్లె గ్రామం సమీపంలోని హెలిప్యాడ్‌కు బయలుదేరడం. |
| ఉ. 10:50 | హెలిప్యాడ్‌కు చేరుకోవడం. |
| ఉ. 11:10 | కొత్తపల్లి గ్రామంలోని పైలాన్ ఆవిష్కరణ ప్రాంగణానికి రోడ్డు మార్గంలో బయలుదేరడం. |
| ఉ. 11:15 | కొత్తపల్లి గ్రామంలో పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం. |
| ఉ. 11:20 | బొల్లవరం బైపాస్ సమీపంలోని తిమ్మయ్య ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బయలుదేరడం. |
| ఉ. 11:25 | బహిరంగ సభకు హాజరు. |
| మ. 1:35 | బహిరంగ సభ నుంచి హెలిప్యాడ్‌కు బయలుదేరడం. |
| మ. 1:45 | హెలిప్యాడ్‌కు చేరుకోవడం. |
| మ. 1:50 | హెలికాప్టర్లో కడప విమానాశ్రయానికి బయలుదేరడం. |
| మ. 2:05 | కడప విమానాశ్రయానికి చేరుకోవడం. |
| మ. 2:10 | ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరడం. |
| మ. 3:10 | గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడం. |
| మ. 3:15 | మంగళగిరి క్యాంపు కార్యాలయానికి రోడ్డు మార్గంలో బయలుదేరడం. |
| సా. 4:00 | మంగళగిరి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం. |
ప్రొద్దుటూరులో పైలాన్ ఆవిష్కరణ.. బహిరంగ సభ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ప్రొద్దుటూరు ప్రాంతంలో రాజకీయ, ప్రజా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై పాల్గొననున్న నేపథ్యంలో సభపై ఉత్కంఠ నెలకొంది.