ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ ఫ్రీ..
ప్రొద్దుటూరు మునిసిపల్ ఎన్నికల్లో వైసిపి చైర్మన్, మెజారిటీ కౌన్సిలర్లు గెలిపిస్తే, తాము అధికారంలో ఉన్నంతకాలం ప్రొద్దుటూరు ప్రజలకు దసరా ఎగ్జిబిషన్ ఉచితంగా అందిస్తామని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తాము అధికారంలో ఉండగా ప్రొద్దుటూరు ప్రజలకు ఎగ్జిబిషన్ ఎంట్రెన్స్ ఉచితంగా కల్పించామన్నారు. టిడిపి వర్గీయులు ఎగ్జిబిషన్ తీసుకొని ప్రజలను దోపిడీ చేస్తున్నారన్నారు. మున్సిపాలిటీకి అమౌంట్ చెల్లించడం లేదన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.