కొర్రపాడు రైతులకు ఎల్‌నినో పరిస్థితులపై అవగాహన.!

ఎల్‌నినో పరిస్థితుల్లో పశుసంపద సంరక్షణపై అవగాహన ర్యాలీ, రైతులకు అవగాహన కార్యక్రమం
రాజుపాలెం మండలం కొర్రపాడులో ఎల్‌నినో పరిస్థితుల్లో పశుసంపద సంరక్షణ, పశుగ్రాస నిర్వహణ, నీటి పొదుపు, వేడి ఒత్తిడి నివారణపై రైతులకు అవగాహన కల్పించేందుకు శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో కొర్రపాడు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల అసోసియేట్ డీన్ డా. జి.ఆర్.కె. శర్మ ముఖ్య అతిథిగా హాజరై, ఎల్‌నినోపై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం రైతులకు పశువుల సంరక్షణలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
కళాశాల ఎల్‌పీఎం విభాగానికి చెందిన డా. డి. ఇందిర, అసోసియేట్ ప్రొఫెసర్ డా.వి. జ్ఞాని చరిత, డా. ఎన్.సుభాషిణి, డా. టి. నాగ సాయి ఉర్మిళ, డా. పి. గాయత్రి, ఎంవీఎస్సీ విద్యార్థులు డా. జి. జాన్ సుధాకర్ బాబు, డా. కె. వంశీ, డా. కె. మాధవరెడ్డి, తదితరులు కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు (NSS POs), ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పశువులకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు, తగినంత నీడ, మంచి గాలి ప్రసరణ కల్పించాలని, ఎండుగడ్డి, సైలేజ్ వంటి పశుగ్రాసాలను ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించడం, సమతుల్య పోషణ అందించడం, వేడి ఒత్తిడి లక్షణాలను గుర్తించి వెంటనే పశువైద్యులను సంప్రదించడం ద్వారా ఎల్‌నినో ప్రభావాలను తగ్గించవచ్చని వివరించారు.