ప్రొద్దుటూరు డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బాలస్వామి రెడ్డి.!
ప్రొద్దుటూరు డిఎస్పీగా బాలస్వామి రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీగా ఉన్న ఆయనను ప్రభుత్వం ప్రొద్దుటూరు డిఎస్పీగా నియమించింది. ఈ మేరకు ఆయన ప్రొద్దుటూరులో జాయిన్ అయ్యారు. మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ను కలిశారు. నూతన డిఎస్పి బాలస్వామి రెడ్డికి ప్రొద్దుటూరు డివిజనల్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. గతంలో బాలస్వామి రెడ్డి రాజుపాలెం ఎస్సైగా, ప్రొద్దుటూరు 1టౌన్ సీఐగా, ప్రొద్దుటూరు ఇంచార్జి డీఎస్పీగా పనిచేశారు.