ఎర్ర దుంగలు స్వాధీనం.!
ప్రొద్దుటూరు: లంకమల్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో గురువారం అటవీశాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 234 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
కడప DFO ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలిసి నాగసావల్లి బీట్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
*ప్రొద్దుటూరు FRO హేమాంజలి తెలిపిన వివరాల మేరకు.. 7 ఎర్రచందనం దుంగలు లభించగా, వాటి బరువు సుమారు 234 కిలోలు ఉన్నట్లు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ కార్యాలయానికి తరలించి, అక్రమ రవాణాకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.