"అధికారులకు అమౌంట్ ముట్టింది" : టిడిపి నేత నాగరాజు

ప్రొద్దుటూరు: స్థానిక హోమస్పేట గీతం కాలేజీ ఎదురుగా మడూరు డ్రైనేజీ కాల్వపై ప్రవేట్ వ్యక్తులు ర్యాంపులు నిర్మించి ఆక్రమణలు చేశారని టీడీపీ నేత, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ కు మంగళవారం పిర్యాదు చేశారు. కాల్వల ఆక్రమణలపై అధికారులకు ఎంత అమౌంట్ ముట్టిందని నాగరాజు మున్సిపల్ కమిషనరును ప్రశ్నించారు. కాల్వల ఆక్రమణల వల్ల ఊరు మునిగి పోతుందన్నారు. అధికారంలో ఉండికూడా ఇటువంటి వాటిని తాము చూస్తూ ఉండాలా అని నిలదీశారు. వెంటనే డ్రైనేజీ కాల్వపై నిర్మించిన ర్యాంపులను తొలగించాలని కోరారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!