చైర్మన్ అభ్యర్థిగా ఇర్ఫాన్ నామినేషన్.!
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇర్ఫాన్ బాషా ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న ఇర్ఫాన్ పార్టీ నాయకులు గోసంగి సుబ్బారెడ్డి తదితరులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల అధికారి వద్ద నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆపార్టీ నుంచి నిన్న 2 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.