రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.!
ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగినది R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ప్రణీత్ కుమార్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రణీత్ కుమార్, తన బావ సుమంత్ కుమార్‌తో కలిసి టీవీఎస్ జూపిటర్ బైక్ (AP 40 CX 5068) పై కొర్రపాడు రోడ్డు వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో సుమంత్ కుమార్ బైక్ నడుపుతుండగా, ప్రణీత్ కుమార్ వెనుక కూర్చున్నాడు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్దకు రాగానే, ఒక ట్రాక్టర్ (AP 39 NQ 6312) దానిని అతివేగంగా, అజాగ్రత్తగా వెళ్తూ, ఆకస్మాత్తుగా దానిని తిప్పగా, సదరు ట్రాక్టర్ ట్రాలీ స్కూటీని తగలగా స్కూటీ లో వెళ్తున్న ప్రణీత్, సుమంత్ ఇరువురు క్రింద పడగా, వెనుక కూర్చొని ఉన్న ప్రణీత్ ట్రాలీ టైర్ల కింద పడగా
ఆయన తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి, బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రణీత్ కుమార్ మృతి చెందడం జరిగినది.
ఘటనపై సమాచారం అందుకున్న ప్రొద్దుటూరు ట్రాఫిక్ CI ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్ సీఐ ఎన్. భాస్కర్ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించడం జరిగినది.