దీర్ఘకాలిక సెలవులో మున్సిపల్ అధికారులు.!

ప్రొద్దుటూరు మున్సిపల్ ఇంజినీర్ శ్రీనివాసులు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు.  ఆయన స్థానంలో డీఈ రాజేశ్ ను ఇంచార్జి MEగా నియమించారు.  మున్సిపల్ కార్యాలయం మేనేజర్ పుల్లయ్య, ఆడిట్ ఆపీసర్ డేవిడ్ ఇదివరకే సెలవులో వెళ్లారు.  ఇప్పుడు ME శ్రీనివాసులు కూడా లాంగ్ లీవులో వెళ్లారు.  రూ.కోట్లల్లో అభివృద్ధి పనులు ప్రారంభమైన సమయంలో, మున్సిపల్ ఎన్నికల సమయంలో కీలకమైన అధికారులు ఒక్కొక్కరుగా సెలవులో వెళ్తున్నారు.