కాంట్రాక్టరుకు వెసలుబాటు ఇవ్వాలి.. కలెక్టర్ కు కమీషనర్ లేఖ.!
ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ వివాదాన్ని కమిషనర్ విశ్వనాథ్ జిల్లా కలెక్టర్ కు అంటగట్టారు. కమిషనర్ విశ్వనాథ్ ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ కు వెసలుబాటు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసి, ఆయనను ఈ వివాదంలోకి తీసుకొచ్చారు . దసరా పండుగ అయ్యాక ఈనెల 26న పూర్తి అమౌంట్ చెల్లిస్తాడంటూ కమిషనర్ కలెక్టర్ కు లేఖ రాశారు.
*గత నెల 28న ఎగ్జిబిషన్ వేలం నిర్వహించారు. శివకుమార్ రూ.1,85,00,070(+33,30, 012జీఎస్టీ)లకు దక్కించుకున్నాడు. వేలంలో రూ.25 లక్షలు చెల్లించాడు. మిగతా అమౌంట్ 5 రోజుల్లోపు చెల్లించాలని కమిషనర్ మీడియా సాక్షిగా ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కాగా.. ఈనెల 9వరకు అమౌంట్ చెల్లించని కాంట్రాక్టర్ వాయిదాల్లో చెల్లిస్తామని కమిషనర్ కు అఫిడవిట్ సమర్పించారు. ఈమేరకు కమిషనర్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. 5 రోజుల్లో కట్టాల్సిన ఎగ్జిబిషన్ పూర్తి అమౌంట్ ను విడతల వారీగా ఈనెల 10, 17, 26 తేదీల్లో చెల్లిస్తాడని వెసలుబాటు ఇవ్వాలంటూ కమిషనర్ కలెక్టర్ కు విన్నవించారు.
*ఈ పరిస్థితుల్లో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ అభ్యర్థనను జిల్లా కలెక్టర్ ఆమోదించారా, అనుమతించారా, తిరస్కరించారా అనేది తెలియాల్సి ఉంది. కాగా..
పూర్తి అమౌంట్ కట్టించుకోకుండా ఎగ్జిబిషన్ ప్రారంభం చేస్తే అడ్డుకుంటామని, ధర్నా నిర్వహిస్తామని టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. దీంతో ప్రొద్దుటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.