ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ బదిలీ.!
ప్రొద్దుటూరు ASP విభూకృష్ణను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యువ IPS అధికారి ASP విభూకృష్ణ ప్రొద్దుటూరులో కేవలం 10 నెలలు మాత్రమే ఉన్నారు. ఈ కొద్ది కాలంలోనే ఆయన ప్రజల నుంచి మన్ననలు పొందారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్నారు. గంజాయి, క్రికెట్ బెట్టింగులపై కఠినంగా వ్యవహరించారు. శాస్త్రీయ పద్ధతిలో నేర పరిశోధన చేసి పాత పెండింగ్ కేసులను పరిష్కరించారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి, పెద్ద మొత్తంలో రికవరీ చేశారు. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్టేట్ పెరేడ్ కమాండెంట్ గా వ్యవహరించారు. గవర్నర్, సీఎం, డీజీపీ ప్రశంసలు పొందారు. మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
కడప మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డిని ప్రొద్దుటూరు డీఎస్పీగా నియమించారు. బాలస్వామి రెడ్డి గతంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాలెం ఎస్సైగా, ప్రొద్దుటూరు 1టౌన్ సీఐగా, ప్రొద్దుటూరు ఇంచార్జి డీఎస్పీగా పనిచేశారు. ఈ ప్రాంతంపై ఆయనను మంచి అవగాహన ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీ జరిగినట్లు సమాచారం.