శ్రీ చైతన్య పాఠశాలలకు నోటీసులు.!
ప్రొద్దుటూరుకు సోమవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. మండలంలోని 239 పాఠశాలలకు సెలవు ఇచ్చారు. అయితే విద్యాశాఖ ఆదేశాలను దిక్కరించి
శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల, వై.ఎం.ఆర్. కాలనీ మరియు శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల, రాజీవ్ కాలనీలో పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సంబంధిత పాఠశాలల వద్దకు CRPలను పై అధికారులకు పంపించారు. షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఈ విషయంపై ఉప విద్యాశాఖాధికారి జి.ఎల్.వి.శివప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సెలవు రోజుల్లో పాఠశాలలు నిర్వహించకుండా అన్ని యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని ఆదేశించారు.