జగన్ పై విమర్శలకే.. ఆ సభ: రవిరెడ్డి

కడప: 28 నెలల్లో ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వలేని కూటమి ప్రభుత్వం.. ఇంటింటికీ మద్యం మాత్రం చేరుస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి నేతలు పబ్లిసిటీ కోసమే ప్రొద్దుటూరులో జలజీవన్ సభ పెట్టారని, జగన్‌ను విమర్శించడమే లక్ష్యంగా సభ సాగిందన్నారు.  గత ప్రభుత్వంలో పూర్తయిన పనులకు కూటమి ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తోందన్నారు.  జగన్ హయాంలో 5 నియోజకవర్గాల్లో నీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు.  ప్రొద్దుటూరు తాగునీటి ప్రాజెక్టు పనులు 90 శాతానికి పైగా జగన్ హయాంలోనే పూర్తయ్యాయన్నారు.  ప్రొద్దుటూరు తాగునీటి ప్రాజెక్ట్ టెస్ట్ ట్రయల్స్ 2022లోనే విజయవంతంగా చేశామన్నారు.