చైర్మన్ పదవికి పుత్తా లక్ష్మిరెడ్డి నామినేషన్.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు.  హైకోర్టు న్యాయవాది అయిన పుత్తా లక్ష్మిరెడ్డి ప్రొద్దుటూరు ప్రజల సమస్యలపై,  ప్రభుత్వ శాఖల్లోని అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తున్నారు.  ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  బాదితుల తరుపున పోరాటాలు చేశారు.  ప్రభుత్వ అధికారుల అవినీతిపై లోకాయుక్తలో పిర్యాదులు చేసి, విచారణకు తీసుకువచ్చారు.  ప్రొద్దుటూరు అమృతనగర్లో పేదల ఇళ్ల పట్టాల సమస్య, ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం ఆభరణాల మాయం, ఆలయ నిధుల స్వాహ,  ప్రొద్దుటూరు హౌసింగ్ కుంభకోణం, మున్సిపల్ పెట్రోల్ బంక్ అవినీతిపై ఆయన పోరాటం చేస్తున్నారు.  అగస్త్యేశ్వరాలయంలో అధికారుల అవినీతిపై లోకాయుక్త కేసు నమోదు చేసి, విచారణ చేపట్టింది.