ప్రొద్దుటూరు: మున్సిపల్ ఖజానాకు గండి.?

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ శివకుమార్ మున్సిపాలిటీకి చెల్లించాల్సిన రూ.1.84 కోట్లను ఇప్పటి వరకు చెల్లించలేదు. డబ్బులు కట్టకుండానే మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండులో మెటీరియల్ దించాడు.  NOC లేకుండానే ఏర్పాట్లు చేస్తున్నారు.  మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు.  కాంట్రాక్టర్, అధికారుల మద్య లోపాయికారి ఒప్పందం ఉందేమోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.  మున్సిపల్ ఖజానాకు గండి కొడుతున్న వారిపై స్పెషల్ ఆఫీసర్ జేసీ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.