ప్రొద్దుటూరులో భారీ బందోబస్త్.!
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద DSP బాలస్వామి రెడ్డి పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో, పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 మంది సిఐలు కొండారెడ్డి, వంశీనాద్, రామాంజనేయుడు, నాగభూషణ్, భాస్కర్, 9 మంది ఎస్సైలు, సుమారు 100 మందికిపైగా పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తున్నారు.