టిడిపి నేతపై కలెక్టర్ కు లేఖ రాసిన మున్సిపల్ కమిషనర్.!
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ అవినీతి, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి మాజీ ఇంచార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో ఘాటైన ఆరోపణలు చేశారు. ఆయనపై సీఎం, డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు, హైకోర్టులో కేసు వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రవీణ్ పై మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. అధికార పార్టీతోనే కమిషనర్ డీ కొంటున్నారని ప్రొద్దుటూరు ప్రజలు చర్చించుకుంటున్నారు.