ఆ అధికారికి కాంట్రాక్టర్ పై ఎంత ప్రేమో.?

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ వేలం గత నెల 28న కమిషనర్ విశ్వనాథ్ నిర్వహించారు.  5 రోజుల్లోపు పూర్తి అమౌంట్ కట్టాలని కమీషనర్ నిబంధన విధించారు. శివకుమార్ రూ.1.84(+18%) కోట్లకు ఎగ్దజిబిషన్ దక్కించుకున్నాడు.  GST రిజిస్ట్రేషన్ తీసుకోలేదు.  ఇప్పటి వరకు పూర్తి అమౌంట్ కట్టలేదు.  ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుమతులు కూడా పొందలేదు.  ఈ పరిస్థితుల్లో షార్ట్ టెండర్ పిలవాలి.  లేదా వేలంలో 2వ స్థానంలోని కంట్రాకర్ కు అప్పగించాలి.  మున్సిపల్ రాబడికి నష్టం కలిగించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి.  డిపాజిట్ స్వాధీనం చేసుకోవాలి.  బ్యాంక్ తీసుకోవాలి.  ఆస్తుల అటాచ్మెంట్ చేయాలి.  లేదా.. మున్సిపల్ ఆదాయానికి గండి పెట్టిన మున్సిపల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని, అధికారి నుంచి అమౌంట్ రికవరీ చేయాలని, సస్పెంట్ చేయాలని ప్రొద్దుటూరు ప్రజలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు.