ఎగ్జిబిషన్ అమౌంట్ వసూలు కాకపోతే కమిషనరే బాధ్యుడు..

ప్రొద్దుటూరు: జిల్లా కలెక్టర్ వద్దకు ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ పంచాయతీ చేరిందని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గీయులు ఎగ్జిబిషన్ వేలం రూ.1.84 కోట్లకు పాడారన్నారు. ఇప్పటివరకు డబ్బులు చెల్లించ లేదన్నారు. డబ్బులు చెల్లించకుండానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. వేలం జరిగిన ఐదు రోజుులోపు పూర్తి అమౌంట్ కమిషనర్ కట్టించలేదన్నారు. ఎగ్జిబిషన్ అమౌంట్ నష్టానికి కమిషనరే పూర్తి బాధ్యుడన్నారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ పంచాయతీని జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లాడన్నారు. కొత్తపల్లి పంచాయతీలో టిడిపి మాజీ ఇంచార్జ్ ప్రవీణ్ ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ మూయించాలని ఎమ్మెల్యే కలెక్టర్ పై ఒత్తిడి తెచ్చాడన్నారు. కలెక్టర్ టిడిపికి చెందిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మాజీ ఇంచార్జ్ ప్రవీణ్ మధ్య పంచాయితీ చేస్తున్నాడన్నారు. మున్సిపాలిటీ ఖజానాకు నష్టం జరిగితే ఒప్పుకునేది లేదని రాచమల్లు హెచ్చరించారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.