శంకర బాలాజీపై చర్యలు లేవా.?

కడప జిల్లాలో దేవుని సొమ్ము కోసం అధికారుల మధ్య వార్ జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.  జిల్లా దేవాదాయశాఖ అధికారి శంకర బాలాజీపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి.  ఆ అధికారి ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం ఈఓగా ఉన్నప్పుడు అమ్మవారి బంగారు హారం, స్వామివారి వెండి కవచం, రూ.కోటి నగదు దారి మళ్ళాయి.  విచారణ జరిపిన అధికారులు అవినీతి జరిగిందని ప్రభుత్వానికి నివేదిక పంపారు.  అయినా అవినీతి ఆరోపణలున్న ఆ అధికారిని కొనసాగిస్తున్నారు.  ఆ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పుడు 15 ఆలయాలకు ఈఓగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు.  మీనాపురం రామలింగేశ్వర ఆలయం పరిపాలనపై PGRSలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా సస్పెండ్ చేశారు.  అవినీతి ఆరోపణలున్న ఏసీ శంకర బాలాజీపై మాత్రం చర్యలు లేవు.  ఇదేమి చోద్యమని దేవాదాయ శాఖలోని ఉద్యోగులు, భక్తులు, ప్రజలు చర్చించుకుంటున్నారు.  కడప జిల్లా నుంచి ఎండోమెంట్ ఉన్నతాధికారులకు నెల మామూలు వెళ్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.  అందుకే ఆ అధికారిపై చర్యలు లేవని చర్చించుకుంటున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!