ప్రొద్దుటూరు ధనియాల ప్రాసెసింగ్ యూనిట్లపై విజిలెన్స్ దాడులు.!

ప్రొద్దుటూరులో సుమారు 10 ధనియాల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి.  వీటిలో ధనియాలు, పప్పు శనగ, పల్లీలు తదితర ఆహార పదార్థాలకు ఆకర్షణీయమైన రంగుల మిశ్రమాన్ని కలుపుతారు.  రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి ధనియాలు ఇతర ఆహార పదార్థాలను తీసుకు వస్తారు.  రంగుల రసాయన మిశ్రమాన్ని కలిపి దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తారు.  వీరు స్థానికంగా వ్యవసాయ మార్కెట్ సెస్(పీజు) సైతం చెల్లించడం లేదు. 
*కడప రీజినల్ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి మరియు సూపరింటెండెంట్  వెంకట రామాంజనేయులు ఆదేశాల మేరకు బుధవారం ప్రొద్దుటూరు  మండి బజార్ రోడ్డులోని జ్యోతి & కంపెనీ నందు రసాయనాలు కలిపి కృత్రిమంగా ధనియాల పౌడర్ ను తయారు చేస్తూ ఉన్నారనే సమాచారం మేరకు కడప విజిలెన్స్ అధికారులు మరియు ప్రొద్దుటూరు ఫుడ్ సేఫ్టీ అధికారులతోకలిసి తనిఖీలు నిర్వహించారు.  ఈ తనిఖీలలో రూ.1,48,22,470ల విలువైన 1,93,540 కిలోల ధనియాల పౌడర్ సీజ్ చేశారు.  
గాజులపల్లి రమేష్ మరియు గాజులపల్లి వినయ్ అనే ఇద్దరు వ్యక్తులపై ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ నందు 6(a) కేసు నమోదు చేయడమైనది.
*ఈ తనిఖీలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ P.శ్రీనివాస రెడ్డి, విజిలెన్స్ AO లక్ష్మణ్ కుమార్, ప్రొద్దుటూరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
*గతంలో విజిలెన్స్ సీఐ శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలోనే ప్రొద్దుటూరులోని విషపూరిత ప్రమాదకరమైన  కళ్ళాపి, కుంకుమ రంగు తయారీ యూనిట్లపై దాడులు చేసి కేసులు నమోదుచేసి, సీట్ చేశారు.  అల్లము, వెల్లుల్లి తదితర రసాయన కల్తీ పేస్ట్ మిశ్రమాలను పట్టుకున్నారు.  ప్రొద్దుటూరు బియ్యం గోడౌన్లో దాడులు నిర్వహించి, అక్రమాలను గుర్తించారు.