మడూరు కాల్వ కబ్జా.. కమీషనర్ పరిశీలించారు.!
ప్రొద్దుటూరు: స్థానిక హోమస్పేట వెనుకవైపు గీతం కాలేజీ ఎదురుగా మడూరు డ్రైనేజీ కాల్వను ఆక్రమించి ర్యాంపులు నిర్మించారు. మీడియాలో వైరల్ అయ్యింది. అధికార పార్టీ నేత, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు మున్సిపల్ కమిషనరుకు నేరుగా పిర్యాదు చేశారు. బుధవారం కమీషనర్ కాల్వ ఆక్రమణలను పరిశీలించారు. వెళ్లిపోయారు. చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.