ప్రొద్దుటూరు: మరీ ఇంత బరితెగింపా.. మున్సిపల్ కాల్వ కబ్జా.!

ప్రొద్దుటూరుకు సోమవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వచ్చారు.  వారి పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు మునిసిపల్ మంత్రి నారాయణతో పాటు పలువురు మంత్రులు ప్రొద్దుటూరుకు వచ్చారు.  ఇటువంటి సమయంలో స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉంటారు.  చిన్నపాటి సమస్య, విమర్శ, ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.  అయితే ఇక్కడ మాత్రం స్థానిక అధికారుల అండ చూసుకుని అక్రమార్కులు బరితెగించారు.  ప్రొద్దుటూరులోని ప్రధాన మడూరు డ్రైనేజీ కాల్వను ఆక్రమించారు.  హోమస్పేట వెనుకవైపున(గీతం కాలేజీ ఎదురుగా) మడూరు డ్రైనేజీ కాల్వపై ర్యాంపులు నిర్మించారు.  సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ జేసీ నిధిమీనా, స్థానిక మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్
ప్రొద్దుటూరులో మున్సిపల్ ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.