ప్రొద్దుటూరులో మంత్రుల మకాం.!

ప్రొద్దుటూరు: పలువురు రాష్ట్ర మంత్రులు ప్రొద్దుటూరులో మకాం వేశారు.  జల జీవన్ మిషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, రాష్ట్ర బిజెపి చీఫ్ మాధవ్ సోమవారం ప్రొద్దుటూరుకు వస్తున్నారు.  సీఎం చంద్రబాబు ప్రొద్దుటూరు పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఇంచార్జ్ మంత్రి సవిత, పురపాలక మంత్రి నారాయణ, రోడ్లు భవనాల శాఖామంత్రి జనార్దన్ రెడ్డి శనివారం ప్రొద్దుటూరుకు చేరుకున్నారు.  స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విశ్వనాధ్, టిడిపి ముఖ్య నేతలు, జిల్లా ఉన్నతాధికారులతో మంత్రులు సమావేశం నిర్వహించారు.  అమృతనగర్లో రెండు హెలిప్యాడ్ల నిర్మాణాలు చేస్తున్నారు.  జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో జల జీవన్ మిషన్ ప్రాజెక్టుల ఫైలాన్ నిర్మిస్తున్నారు.  తిమ్మయ్య కళ్యాణ మండపం సమీపంలో సీఎం బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేస్తున్నారు.  బొల్లవరం మునిసిపల్ ప్లాట్లలో వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు.  వీటి ఏర్పాట్లను పరిశీలించారు.  మరికొంతమంది మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఆదివారం ఇక్కడికి వస్తున్నారు.