గాంధీ చూపిన మార్గం అందరూ ఆచరించాలి: ఎమ్మెల్యే
మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సూచించారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అహింసా మార్గంలో గాంధీ స్వాతంత్రోద్యమాన్ని నడిపారన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చారన్నారు. ఆయన చూపిన ఆశయాలు, స్పూర్తి, అహింసావాదం అందరూ ఆచరించాలన్నారు. నేటి యువత గాంధీ జీవితాన్ని చదవాలన్నారు.