ప్రొద్దుటూరు వాసులు చాలా మంచివారు: ASP విభూకృష్ణ
ప్రొద్దుటూరు వాసులు చాలా మంచివారని, వారి ఆదరణ అభిమానాలను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ASP విభూకృష్ణ తెలిపారు. జిల్లా అధికారులు, స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో తనకు అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.
*ప్రొద్దుటూరు నుంచి బదిలీ అయిన ఏఎస్పీ విభూకృష్ణ దంపతులకు స్థానిక పోలీస్ అధికారులు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ప్రొద్దుటూరులో పోలీస్ శాఖకు, ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. కేసుల విచారణ, దర్యాప్తు, అరెస్ట్, రికవరీలో క్రింది స్థాయి అధికారులకు అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు. ASP విభూకృష్ణ ప్రొద్దుటూరులో కేవలం 10 నెలల పాటు మాత్రమే పని చేసినప్పటికీ, అందరి అభిమానాలను, ఆదరణను పొందారని ప్రశంసించారు. సీఐలు నాగభూషణ్, కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయులు, భాస్కర్, ఎస్సైలు మధుసూదన్ రెడ్డి, మొయిద్దీన్, రాఘవేంద్ర రెడ్డి, మహబూబ్ బాషా, సంజీవరెడ్డి, శ్రీకాంత్, రాజు, భాస్కర్, ప్రణయ్ కుమార్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.