ఎగ్జిబిషన్ నుంచి కమిషనర్ కు ఎంత ముట్టింది .?:AISF నేతలు
పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ నిజాయితీపై AISF విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. AISF ఆధ్వర్యంలో సోమవారం ప్రొద్దుటూరు MRO కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా AISF నాయకులు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ నిర్వాహకుల నుంచి కమిషనర్ కు ఎంత అమౌంట్ ముట్టిందని ప్రశ్నించారు. ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నాడన్నారు. ఇక్కడి మాటలు అక్కడికి, ఇక్కడి మాటలు అక్కడికి చేరవేస్తున్నాడన్నారు. మున్సిపల్ గ్రౌండ్ ఎగ్జిబిషన్ ఆదాయాన్ని మున్సిపల్ పాఠశాలల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం MRO ఉదయభాస్కర్ రాజుకు వినతి పత్రం సమర్పించారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.