5న స్కూళ్లకు సెలవు: డిప్యూటీ డీఈఓ శివ ప్రసాద్
ప్రొద్దుటూరు మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలకు ఈనెల 5న సెలవు ప్రకటించినట్లు ప్రొద్దుటూరు ఉప విద్యాశాఖాధికారి శివ ప్రసాద్ శనివారం తెలిపారు. 5న ప్రొద్దుటూరుకు సీఎం చంద్రబాబు వస్తున్న సందర్భంగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. మండలంలో ప్రాధమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 239 ఉన్నాయి. ఇందులో 110 ప్రభుత్వ, 129 ప్రవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటన్నిటికి సోమవారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు.