డబ్బుల పంపిణీ ఆరోపణపై 2పాఠశాలల్లో ఎన్నికలు రద్దు: జిల్లా కలెక్టర్ శ్రీధర్

కడప: కలసపాడు మండలంలోని తెల్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొండపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించాల్సిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్.ఎం.సి.) ఎన్నికలను జిల్లా కలెక్టర్ శ్రీధర్ రద్దు చేశారు.
ఎస్.ఎం.సి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి డబ్బుల పంపిణీ జరిగినట్లు వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఈ రెండు పాఠశాలల్లో జరగాల్సిన ఎన్నికలను రద్దు చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. 
ఎస్.ఎం.సి. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ఎటువంటి ప్రలోభాలకు తావులేకుండా నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.  ఎన్నికల ప్రక్రియలో డబ్బుల పంపిణీ, ప్రలోభాలు లేదా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించినా, లేదా ఫిర్యాదు అందినా, విచారణ చేపట్టి సంబంధిత ఎన్నికలను రద్దు చేసి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.