పవన్ ఫోటోకు కమిషనర్ సెల్యూట్.. SMలో ట్రోలింగ్.!

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాధ్ అధికారిక చాంబర్లో డిప్యూటీ సీఎం పవన్ ఫోటో తొలగించి, స్థానిక ఎమ్మెల్యే ఫోటో ఏర్పాటు చేశారు.  దీనిపై స్థానిక జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఈ తప్పు సరిదిద్దుకోవడానికి పవన్ ఫోటోకు సెల్యూట్ చేస్తూ, తనకు తాను ఫోటో తీసుకొని మీడియాలో కమిషనర్ షేర్ చేశారు.
పవన్ ఫోటోకు సెల్యూట్ చేసి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను విస్మరించడంపై ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇది రచ్చ రచ్చ అయ్యింది.  కమిషనర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే, జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి.  దీంతో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ వ్యవహార శైలి అధికార పార్టీకి, అధికారులకు, ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.