అర్హులైన వారందరికీ పక్కా ఇల్లు: MLA వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరులో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం పక్కా ఇల్లు మంజూరు చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు.  ఆయన బుధవారం స్థానిక సాంబయ్యగారి వీధిలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ PMAY.02 అర్బన్ హౌసింగ్ స్కీం క్రింద సొంత ఇంటి స్థలం ఉన్నవారు ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 3 విడతల్లో 401ఇళ్లు మంజూరయ్యాయన్నారు.  నేడు 83 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చారు.  ఒక్కో ఇంటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.50 లక్షలు ఇస్తున్నాయన్నారు.  కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం, ఈఈ రమణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, హౌసింగ్ అధికారులు, టిడిపి నేతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.