ప్రొద్దుటూరు అభివృద్ధికి నిధుల వరద:MLA వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వంలో ప్రొద్దుటూరు అభివృద్ధికి నిధుల వరద పారిస్తున్నట్లు స్థానిక MLA వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(HUM) ప్రాజెక్ట్ కింద మొదటి విడతలో మంజూరైన రూ.40 కోట్ల పనులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో సుమారు రూ.296 కోట్లతో CC రోడ్లు, డ్రైన్స్, పార్కులు, త్రాగునీటి సరఫరా, లైటింగ్, మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్ తదితర పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవలే 15th ఫైనాన్స్ గ్రాంట్స్ రూ.12 కోట్ల పనులు ప్రారంభమయ్యాయన్నారు.
*కార్యక్రమంలో రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, మాజీ MLC పుల్లయ్య, కూటమి పార్టీల నాయకులు, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.