గణపతి స్వర్ణోత్సవాల సావనీర్ విడుదల చేసిన MLA.!
ప్రొద్దుటూరు శివాలయం వినాయక స్వర్ణోత్సవాల వేడుకల సావనీర్ మంగళవారం స్థానిక MLA వరదరాజుల రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1976 నుంచి 50 సంవత్సరాలుగా శివాలయంలో గణపతి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. దాతలు, భక్తుల సహకారంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అభినందించారు. శివాలయం చైర్మన్ నారాయణరెడ్డి, డా. నాగదస్థగిరి రెడ్డి, VHP మల్లికార్జున రావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.