వన్యప్రాణుల చర్మాలు స్వాదీనం: DFO రాజశేఖర్

కడప జిల్లా అటవీశాఖ అధికారులు శనివారం వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్ ముఠా సభ్యులను పట్టుకున్నారు.  వారి నుంచి మచ్చల జింక చర్మం, 5 పులి అనుకరణ చర్మాలు, 23 నకిలీ పులి గోళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎన్‌ఎస్‌టిఆర్ పశువైద్య బృందం పరీక్షింవారు.  ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.  దర్యాప్తు కొనసాగుతోందని కడప DFO రాజశేఖర్ బాబు ఆదివారం మీడియాకు తెలిపారు.  సబ్ DFO సంకేత్ సునీల్, ప్రొద్దుటూరు FRO హేమాంజలి, బద్వేలు FRO నయీమ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.