ప్రొద్దుటూరులో CM పర్యటనకు ఏర్పాట్లు.!
ప్రొద్దుటూరుకు ఈనెల 5న CM చంద్రబాబు రానున్నారు. ప్రొద్దుటూరు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కలిసి గురువారం పరిశీలించారు. హెలిపాడ్, బహిరంగ సభ, వాహనాల పార్కింగ్ కోసం స్థల పరిశీలన జరిపారు. జమ్మలమడుగు రోడ్డులో బొల్లవరం మున్సిపల్ ప్లాట్ల స్థలాన్ని పరిశీలించారు. బందోబస్తు, సెక్యూరిటీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంపై సమీక్షించారు. జేసీ నిధిమీనా, ASP విభుకృష్ణ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, R&B, ఫైర్ అధికారులు, టిడిపి నేతలు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.