ఎల్‌నినో పరిస్థితుల్లో పశు సంరక్షణపై రైతులకు అవగాహన.!

రాజుపాలెం: ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల సంరక్షణపై ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో రాజుపాలెం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో 38 మంది రైతులు పాల్గొన్నారు.
పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డా. జి.ఆర్.కె. శర్మ మాట్లాడుతూ.. ఎల్‌నినో పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పశువుల ఆరోగ్యం, మేత తీసుకోవడం, పాల ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.   రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  పశువులకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు, తగినంత నీడ, మంచి గాలి ప్రసరణ కల్పించాలన్నారు.  ఎండుగడ్డి, సైలేజ్ తదితర పశుగ్రాసాలను ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచించారు.
రాజుపాలెం APM సుజాత, డా. డి.ఇందిర ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల యాజమాన్య పద్ధతులు, పశుగ్రాస నిర్వహణ, నీటి సంరక్షణ, వేడి ఒత్తిడి నివారణపై రైతులకు అవగాహన కల్పించారు.  డా. చరిత, డా. గాయత్రి, డా. మంజుల, డా. జాన్, డా. వంశీ, డా. మాధవరెడ్డి, శ్రీ రాజేష్ తదితరులు పశువుల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, పశుపోషణ, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై వివరించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.