పార్టీలకు అతీతంగా చైర్మన్ అభ్యర్థికి మద్దతిస్తాం: వైసీపీ
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ టిక్కెట్ చేనేతలకు తెచ్చుకుంటే పార్టీలకు అతీతంగా మద్దతిస్తామని వైసీపీకి చెందిన చేనేత కులాల నేతలు మాజీ మున్సిపల్ చైర్మన్ బీమునిపల్లె లక్ష్మీదేవి, మాజీ కౌన్సిలర్లు పిట్టా బద్రమ్మ, పిట్టా బాలాజి, బండారు రఘురామయ్య, సూర్యనారాయణ, రాగల నరసింహులు తదితరులు గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఇటీవల బీసీ సంఘాల నేత బొర్రా రామాంజనేయులు టిడిపి చైర్మన్ టిక్కెట్ చేనేతలకు ఇస్తే గెలిపించుకుంటా మన్నారని, చేనేతలు టీడీపీలో మాత్రమే ఉన్నారా అని వారు ప్రశ్నించారు. అయినా టీడీపీ నుంచి చేనేతలు చైర్మన్ టిక్కెట్ తెచ్చుకుంటే తమ పార్టీ నాయకులను ఒప్పించి మద్దతు ఇస్తామని బొర్రా రామాంజనేయులుకు వైసీపీ చేనేత కులాల నేతలు తెలిపారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.