సిఐ నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్ ను అభినందించిన జిల్లా ఎస్పీ విశ్వనాథ్.!

ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్ ను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.  ప్రశంసా పత్రం, నగదు రివార్డు అందజేశారు.  సీఐ నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్ గతంలో బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేశారు.  బద్వేలులో జక్కల విఘ్నేష్ అనే యువకుడు మైనర్ బాలికను అత్యాచారం చేసి, సజీవ దహనం చేసి, హత్య చేశాడని కేసు నమోదయింది.  90 రోజుల్లోనే కేసు దర్యాప్తును సీఐ నాగభూషణ్ పూర్తి చేశారు. సమగ్రమైన ఆధారాలతో చార్జి షీట్ కడప పోక్సో కోర్టుకు సమర్పించారు.  ఈ కేసులో విచారణ జరిపిన జడ్జి సోమశేఖర్ నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.  ఈ కేసులో దర్యాప్తు మరియు ప్రాసిక్యూషన్ బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.  
*అప్పటి అట్లూరు SI B. రామకృష్ణ, అప్పటి బద్వేలు రూరల్ SI K. శ్రీకాంత్, ASI RV. నరసింహ రావు, PC N. ప్రసన్న కుమార్ లను మరియు సంఘటనా స్థలం నుండి తీవ్ర కాలిన గాయాలతో ఉన్న బాధితురాలిని బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి చెర్చి ఆమె ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించిన అప్పటి బద్వేలు రూరల్ SI K. శ్రీకాంత్, అతడి సిబ్బంది హెచ్.సి 623, టి.వి.ఎన్. ప్రసాద్, పి.సి 2518, కె.సి. పీరయ్య, పి.సి 2924, యు. బ్రహ్మం, పి.సి 2918, ఎస్.ఎం.డి. రఫీ, పి.సి 1448, ఎస్.కె. ఖాజా హుస్సేన్ & పి.సి 2889, కె. శ్రీనివాసులు లను ప్రత్యకంగా అభినందించి రివార్డులను అందజేశారు.
*మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. నేరం రుజువైతే చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. నేరస్తులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా పకడ్బందీ దర్యాప్తు, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ కొనసాగుతుంది” అని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?