కమిషనర్ గారు ఇటువైపు చూడండి.!

ప్రొద్దుటూరులో బుధవారం సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని ప్రధానమైన గాంధీ రోడ్డులో మోర్ మార్కెట్ నుంచి హోలీ స్టిక్ ఆసుపత్రి వరకు నీళ్లు నిండిపోయాయి. శ్రీరాముల పేట, వెంకటేశ్వర పేట, శ్రీనివాస నగర్, మున్సిపల్ కూరగాయల మార్కెట్, పవర్ హౌస్ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రేపు భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రచార యావ తప్ప మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలో పట్టణంలో రోడ్లు మునిగిపోకుండా కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.