అన్ని స్థానాలకు కాంగ్రెస్ పోటీ: తులసిరెడ్డి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల విజయవాడలో జరిగిన PCC సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరులో అన్ని స్థానాలకు అభ్యర్థులను పోటీ చేయిస్తామని తెలిపారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.