టౌన్ బ్యాంకుపై బుధవారం కాణిపాకంలో ప్రమాణం చేద్దామా.!: బంగారెడ్డి

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో ఫ్రాడ్ చేయలేదని కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమని టిడిపి నేత ఇవి సుధాకర్ రెడ్డి చేసిన సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బంగారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సుచరిత పేరుతో ఉషారాణిని ఇంట్రడ్యూస్ చేయలేదని ఇవి సుధాకర్ రెడ్డి, తాను పోర్జరీసంతకాలు చేయలేదని విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ ఉషారాణి ఇద్దరూ కాణిపాకంలో ప్రమాణం చేయాలని కోరారు. ఈనెల 23న బుధవారం కాణిపాకంలో ప్రమాణం చేద్దామని పిలుపునిచ్చారు. తాము కూడా ఆ అకౌంట్ ఓపెనింగ్, విత్ డ్రాలో పోర్జరీ జరిగిందని ప్రమాణం చేస్తామన్నారు. అంతటితో ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ వివాదానికి ముగింపు పలుకుదామన్నారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?